దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 21,900కు చేరింది. సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 71,998 వద్ద ట్రేడవుతోంది.
ఎఫ్‌ఐఐలు బుధవారం ఈక్విటీ మార్కెట్‌లో రూ.3929.6 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.2897.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా మార్కెట్‌లోని నాస్‌డాక్ బుధవారం ముగింపు సమయానికి 1.3శాతం పెరిగింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్ బాండ్‌ఈల్డ్‌లు 5 పాయింట్లు నష్టపోయి 4.27శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.26 శాతం నష్టపోయి 104.69 పాయింట్లకు చేరింది.
క్రూడాయిల్ ధర 1.5శాతం తగ్గి బ్యారెల్ ధర 81.53 డాలర్లకు చేరింది. రష్యా ఇటీవల ఉక్రెయిన్‌పై జిర్కాన్ హైపర్‌సోనిక్ మిసైల్‌ను ప్రయోగించింది. దాంతో అంతర్జాతీయంగా కొంత అనిశ్చితులు నెలకొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్లు ఈ మధ్యకాలంలో భారీగా ఒడిదొడుకులకు లోనవుతోందని తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చినవారు నష్టభయాన్ని తట్టుకోలేక లాస్‌బుక్ చేస్తుంటారు. కానీ స్టాక్ ఫంటమెంటల్స్పై పూర్తి అవగాహన ఉండి బిజినెస్ మోడల్‌పై పట్టు ఉంటే దీర్ఘకాలికంగా మంచి లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment