అప్పుడు రక్షించాడు.. ఇప్పుడు వేధిస్తున్నాడు.. చివరికి | Hyderabad: Pilligundla Man Arrested For Harassing Girl | Sakshi
Sakshi News home page

అప్పుడు రక్షించాడు.. ఇప్పుడు వేధిస్తున్నాడు.. చివరికి

Published Thu, Aug 12 2021 9:27 AM | Last Updated on Thu, Aug 12 2021 9:29 AM

Hyderabad: Pilligundla Man Arrested For Harassing Girl - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిటీబ్యూరో: శంకర్‌పల్లి మండలం పిల్లిగుండ్లకు చెందిన జంగంపేట ప్రసాద్‌రెడ్డి గతంలో ఓ విద్యార్థినిని తోటి విద్యార్థి వేదింపుల నుంచి కాపాడాడు. ఆ ఘటనతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ప్రేమ పేరిట సదరు విద్యార్థినిని తానే వేధించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో ప్రసాద్‌రెడ్డి వేధింపులు శ్రుతి మించడంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ప్రసాద్‌రెడ్డిని బుధవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

చదవండి: Cyber Crime: ఫోన్‌లోనే పరిచయం, చాటింగ్‌.. అమెరికా వెళ్దామని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement