
( ఫైల్ ఫోటో )
హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో సంచలనం రేపిన బాలిక హత్యాచార కేసు నిందుతుడును పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలోని రాజు స్వగ్రామం అడ్డగూడురులో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సింగరేణి కాలనీకి చెందిన బాలిక గురువారం సాయంత్రం 5 గంటల నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పక్కింట్లో ఉండే రాజు అనే వ్యక్తి ఇంట్లో ఆమె మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. బాలికను తీసుకెళ్లిన రాజు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసి పరారయ్యాడు.
అనంతరం తూర్పు మండలం డీసీపీ రమేష్ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. బాలిక ఆత్యాచారం ఘటనలో నిందితుడు రాజును బహిరంగంగా శిక్షించాలని స్థానికులు ఆందోళన చేశారు. సాగర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాధితుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ హామీఇవ్వడంతో స్థానికులు ఆందోళనను విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment