సాక్షి, పర్వతగిరి(వరంగల్): వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మూడేళ్లుగా వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. దాతల నుంచి సేకరించిన విరాళాలతో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో ఎనిమిది నుంచి 30 ఏళ్ల వయసు విద్యార్థులు తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు చదువుతున్నారు. కరోనా సమయంలోనూ పాఠశాలను కొనసాగిస్తున్న నిర్వాహకులు మైనర్ బాలురను కఠినంగా శిక్షిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముఖ్యంగా ఎనిమిది నుంచి 14 ఏళ్ల పిల్లలను కఠినంగా శిక్షిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థులను కర్రలతో విచక్షణా రహితంగా వాతలు వచ్చేలా కొట్టడంతో వారి తల్లిదండ్రులు ఆ చిత్రాలను ఆదివారం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇలాంటి సంఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నప్పటికి ట్రస్ట్ సభ్యులు పట్టించుకోకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు బాధితుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇలాంటి పాఠశాలను కొనసాగించడానికి వీలు లేదని కోరుకుంటూ తమ పిల్లలను ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment