inhumanity
-
గాజన్లే కవచాలు
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోంది. యుద్ధ సమయంలో ఇళ్లు, సొరంగాల్లోకి ప్రవేశించడానికి పాలస్తీనా పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటోంది. ‘మస్కిటో ప్రోటోకాల్’గా పిలిచే ఈ పద్ధతిని గాజాలోని ఇజ్రాయెల్ యూనిట్లన్నీ అవలంబిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైనికుడే ఈ మేరకు వెల్లడించడం విశేషం. ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు దీన్ని ధ్రువీకరించారు. ఉత్తర గాజా, గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా... ఇలా గాజా అంతటా ఇదే పద్ధతిని అమలు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. – జెరూసలెంనిషేధం బేఖాతరుసైనిక కార్యకలాపాలలో పౌరులను ఇలా అనైతికంగా, అనుమాషంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషిద్ధం. వెస్ట్ బ్యాంక్‌లో అనుమానిత మిలిటెంట్ల తలుపులను తట్టడానికి ఇజ్రాయల్ సైన్యం పాలస్తీనా పౌరులను ఉపయోగిస్తోందని హక్కుల సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు 2005లో ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించింది. దీన్ని క్రూరమైనదిగా, అనాగరికమైనదిగా అభివర్ణించింది. దాంతో ఈ విధానాలను మానుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం అప్పట్లో ప్రకటించింది. కానీ దాన్ని ఇంకా అమలు చేస్తున్నట్టు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. గాజాలో పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం మానవ కవచాలుగా ఉపయోగిస్తున్న మూడు ఫోటోలను ‘బ్రేకింగ్ ది సైలెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ మీడియాకు విడుదల చేసింది. ఉత్తర గాజాలో విధ్వంసకర పరిస్థితుల్లో ఇద్దరు సైనికులు ఓ పౌరుడిని ముందుకు తీసుకువెళుతున్న భయానక దృశ్యం ఒక ఫొటోలో ఉంది. మరో దాంట్లో మానవ కవచాలుగా ఉపయోగించే పౌరుల కళ్లకు గంతలున్నాయి. మూడో ఫొటోలో ఒక సైనికుడు బంధించిన పౌరుడిని కాపలా కాస్తున్నాడు.వెనుక నుంచి కాల్చారు..గాజాలో ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు కూడా దీన్ని ధ్రువీకరించారు. 20 ఏళ్ల మహ్మద్ సాద్ఇజ్రాయెల్ సైన్యం దాడుల తర్వాత ఉత్తర గాజా వీడి ఖాన్ యూనిస్ సమీపంలో తాత్కాలిక శిబిరంలో ఉంటున్నాడు. తనకు, తమ్ముళ్లకు ఆహారం కోసం బయటికొస్తే ఇజ్రాయెల్ సైన్యం పట్టుకుంది. ‘‘మమ్మల్ని జీపులో తీసుకెళ్లారు. 47 రోజుల పాటు రఫా సైనిక శిబిరంలో నిర్బంధించారు. నిఘా చర్యలకు ఉపయోగించారు. మాకు మిలటరీ యూనిఫాం ఇచ్చారు. తలపై కెమెరా పెట్టారు. మెటల్ కట్టర్ ఇచ్చారు. సొరంగాల్లో వెదికేటప్పుడు సాయానికి మమ్మల్ని వాడుకున్నారు. మెట్ల కింద వీడియోలు తీయాలని, ఏదైనా దొరికితే బయటికి తేవాలని చెప్పేవారు. ఒక మిషన్ కోసం పౌర దుస్తుల్లో తీసుకెళ్లారు. సైన్యం వదిలివెళ్లిన ట్యాంకును వీడియో తీయమన్నారు. నేను భయపడితే వీపుపై తుపాకీతో కొట్టారు. నేను ట్యాంకు వద్దకు వెళ్లగానే వెనుక నుంచి కాల్చారు. అదృష్టవశాత్తూ బయటపడ్డా’’ అంటూ వీపుపై తూటా గాయాలు చూపించాడు. 17 ఏళ్ల మొహమ్మద్ షబ్బీర్దీ ఇదే కథ. ఖాన్ యూనిస్‌లోని అతని ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. తండ్రి, సోదరిని చంపి అతన్ని బందీగా పట్టుకుంది. ‘‘నన్ను మానవ కవచంగా వాడుకున్నారు. కూల్చేసిన ఇళ్లలోకి, ప్రమాదకరమైన, మందుపాతరలున్న ప్రదేశాల్లోకి తీసుకెళ్లారు’’ అని షబ్బీర్ చెప్పుకొచ్చాడు.ఏమిటీ మస్కిటో ప్రోటోకాల్శత్రువులున్న చోటికి కుక్కను పంపడం, ట్యాంక్ షెల్ లేదా సాయుధ బుల్డోజర్తో దాడి వంటివి చేస్తారు. కానీ ఈ పద్ధతిలో తాము దాడి చేయాలనుకున్న చోటికి బందీలనో, శత్రు దేశ పౌరులనో ముందుగా పంపిస్తారు. అక్కడ పేలుడు పదార్థాలున్నా, శత్రువులు పొంచి కాల్పులు, పేలుళ్లకు పాల్పడ్డా ముందుగా వెళ్లినవారు చనిపోతారు. ఆ ముప్పు తొలగాక సైన్యం ప్రవేశిస్తుంది. సాధారణంగా ఉగ్రవాద సంస్థలు ఉపయోగించే ఈ పద్ధతిని ఇజ్రాయెల్ సైన్యం అమలు చేస్తోంది.డాక్టర్‌నూ వదల్లేదు...59 ఏళ్ల డాక్టర్ యాహ్యా ఖలీల్ అల్ కయాలీ ఓ వైద్యుడు. గాజాలో అతి పెద్ద వైద్య సముదాయమైన అల్ షిఫా ఆస్పత్రిలో వేలాది మంది శరణార్థులతో కలిసి ఉండేవారు. గత మార్చిలో ఇజ్రాయెల్ సైన్యం రెండు వారాల దాడిలో ఆసుపత్రి ధ్వంసమైంది. అప్పుడే కయాలీని సైన్యం పట్టుకుంది. ‘‘నాతో అపార్ట్మెంట్ భవనాలను, ప్రతి గదినీ తనిఖీ చేయించారు. అదృష్టవశాత్తూ వేటిలోనూ హమాస్ ఫైటర్లు లేరు. అలా 80 అపార్ట్మెంట్లను తనిఖీ చేశాక నన్ను వదిలేశారు’’ అని గుర్తు చేసుకున్నారు.మన ప్రాణాలు ముఖ్యమన్నారు.. ఉత్తర గాజాలో తమ యూనిట్ ఓ అనుమానాస్పద భవనంలోకి ప్రవేశించే ముందు ఇద్దరు పాలస్తీనా ఖైదీలను ముందుగా పంపినట్టు ఇజ్రాయెల్ సైనికుడే వెల్లడించాడు. ‘‘వారిలో ఒకరు 16 ఏళ్ల బాలుడు. మరొకరు 20 ఏళ్ల యువకుడు. ఇదేంటని ప్రశ్నిస్తే మన సైనికుల కంటే పాలస్తీనా యువకులు చనిపోవడం మంచిది కదా అని మా సీనియర్ కమాండర్ బదులిచ్చారు. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొని అలసిపోయాక పెద్దగా ఆలోచించడానికి కుదరదు. అయినా ఈ పద్ధతిని అనుసరించడానికి కొందరు సైనికులం నిరాకరించాం. ‘అంతర్జాతీయ చట్టాల గురించి ఆలోచించొద్దు. ముందు మన ప్రాణాలు ముఖ్యం’ అని కమాండర్ చెప్పారు’’ అన్నాడు. చివరికి ఇద్దరు పాలస్తీనియన్లను వదిలేశారని చెప్పుకొచ్చాడు. -
జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థులు తోటి విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. జామెట్రీ కంపాస్‌తో విచక్షణారహితంగా 108 సార్లు దాడి చేసి గాయపరిచారు. నవంబర్ 24వ తేదీన ఇండోర్ నగరంలోని ఏరోడ్రోమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల దాడి ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(డబ్ల్యూసీ) తీవ్రంగా స్పందించింది. ఘటనపై వెంటనే తమకు నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ‘‘ గొడవ సందర్భంగానే చిన్నారులు ఇలా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. నిందితులైన విద్యార్థులకు హింసాత్మకమైన సన్నివేశాలున్న వీడియో గేమ్స్ ఆడే అలవాటు ఉందా? నాలుగో తరగతి విద్యార్థుల్లో ఇంతటి హింసాప్రవృత్తి ఎలా సాధ్యం? దీనికి కారణాలేంటి? ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తాం. పోలీసుల నివేదిక కోరాం’’ అని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ పల్లవి చెప్పారు. ‘‘ మా అబ్బాయి రక్తమోడుతూ ఇంటికొచ్చాడు. అసలేం జరిగిందో తెలీడం లేదు. తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీ ఇచ్చేందుకు స్కూల్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. వారు బహుశా తమ తప్పును కప్పిపుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారేమో’’ అని బాధిత విద్యార్థి తండ్రి వాపోయాడు. ‘‘ బాధిత విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితులైన విద్యార్థుల వయసు పదేళ్లలోపే. సంబంధిత చట్టాల ప్రకారం కేసు దర్యాప్తు జరుగుతోంది’’ అని నగర అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వివేక్ సింగ్ చౌహాన్ చెప్పారు. ‘‘కొంతకాలంగా స్కూలు చిన్నారుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. దీనిపై అందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరముంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు
కీవ్: ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా అమానవీయంగా ప్రవర్తిస్తుందన్న నివేదికల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలివ్వాలని నాటో కూటమి దేశాలు గురువారం నిర్ణయించాయి. రష్యా దారుణాలు నిజమేనని జర్మనీ నిఘా సంస్థ ధృవీకరించినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఒక కూటమిలాగా ఉక్రెయిన్‌కి సాయం చేయడానికి నాటో నిరాకరించింది. సభ్యదేశాలు విడిగా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ ట్యాంక్ తదితర ఆయుధాలు, ఔషధాలు ఇచ్చేందుకు అంగీకరించాయి. కూటమిలో ఏ దేశం ఎలాంటి సాయం చేయనుందనే వివరాలు తెలిపేందుకు సెక్రటరీ జనరల్ స్టోల్టెన్‌బర్గ్ నిరాకరించారు. ఉక్రెయిన్‌కు ఆధునిక ఆయుధాలు అందిస్తామని, అక్కడ యుద్ధం కొత్త దశకు చేరుతోందని బిట్రన్ వ్యాఖ్యానించింది. అంతకుముందు రష్యా దాడిని ఎదుర్కొనేందుకు తమకు ఆయుధ సహకారం అందించాలని పాశ్చాత్య దేశాలను, నాటోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులెబా కోరారు. నాటో విదేశాంగ మంత్రులతో చర్చలకు ఆయన బ్రసెల్స్ వచ్చారు. ఆయుధాలందిస్తే రష్యా తదుపరి లక్ష్యంగా మారతామని నాటో దేశాల్లో కొన్ని భయపడుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్‌కు అనేక ఆయుధాలను అందించాయి. అయితే విమానాలు, ట్యాంకుల్లాంటి ఆయుధాలను ఇవ్వలేదు. తమకు మిస్సైల్స్, సాయుధవాహనాలు, డిఫెన్స్ సిస్టమ్స్ కావాలని కులెబా కోరుతున్నారు. జర్మనీ లాంటి దేశాలు తమకు మరింత వేగంగా సాయం అందించాలన్నారు. కీవ్, చెర్నిహివ్ ప్రాంతాల నుంచి రష్యా 24 వేల మంది సైనికులను ఉపసంహరించుకుందని, వీరిని తూర్పు ప్రాంతంలో యుద్ధానికి సన్నద్ధం చేస్తోందని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. లుహాన్స్క్, డొనెట్సెక్ ప్రాంతాల్లాగే డోన్బాస్లో కూడా కొన్ని ప్రాంతాలను ఉక్రెయిన్ నుంచి విడగొట్టాలన్నది పుతిన్ యత్నంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. తూర్పు ప్రాంతంపై రష్యా సేనలు దృష్టి పెడుతున్న వేళ అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని స్థానికులను ఉక్రెయిన్ ప్రభుత్వం కోరింది. రష్యాపై ఆంక్షల రూపంలో ఒత్తిడి పెంచుతామని జీ7 దేశాలు ప్రకటించాయి. హక్కుల మండలి నుంచి రష్యా సస్పెన్షన్ మానవహక్కుల సమాఖ్య నుంచి రష్యాను సస్పెండ్ చేసే తీర్మానానికి ఐరాస ఆమోదం లభించింది. ఈ తీర్మానంపై ఐరాస జనరల్ అసెంబ్లీలో గురువారం ఓటింగ్ జరిగింది. రష్యా సస్పెన్షన్‌కు అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 24 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఐరాస శాశ్వత సభ్యదేశాల్లో ఇంతవరకు ఏ దేశం కూడా ఐరాస అనుబంధ విభాగాల నుంచి సస్పెండ్ కాలేదు. -
వేద పాఠశాలలో దారుణం.. మైనర్ బాలురకు వాతలు
సాక్షి, పర్వతగిరి(వరంగల్): వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మూడేళ్లుగా వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. దాతల నుంచి సేకరించిన విరాళాలతో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో ఎనిమిది నుంచి 30 ఏళ్ల వయసు విద్యార్థులు తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు చదువుతున్నారు. కరోనా సమయంలోనూ పాఠశాలను కొనసాగిస్తున్న నిర్వాహకులు మైనర్ బాలురను కఠినంగా శిక్షిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఎనిమిది నుంచి 14 ఏళ్ల పిల్లలను కఠినంగా శిక్షిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థులను కర్రలతో విచక్షణా రహితంగా వాతలు వచ్చేలా కొట్టడంతో వారి తల్లిదండ్రులు ఆ చిత్రాలను ఆదివారం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇలాంటి సంఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నప్పటికి ట్రస్ట్ సభ్యులు పట్టించుకోకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు బాధితుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇలాంటి పాఠశాలను కొనసాగించడానికి వీలు లేదని కోరుకుంటూ తమ పిల్లలను ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. -
మానవత్వం మంటగలిసిన వేళ
సాక్షి, హైదరాబాద్: చేతిలో చిల్లి గవ్వలేదు.. చుట్టాలకు చెప్పినా స్పందిస్తారనే ఆశ లేదు.. ఒకవైపు ఇంటి ఓనర్, చుట్టుపక్కలవారి వేధింపులు.. మరోవైపు ఏం చేయాలో పాలుపోని స్థితి.. దీం తో ఓ వ్యక్తి తన తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక పుట్‌పాత్ మీద మృతదేహాన్ని వదిలేసిన హృదయవిదారక ఘటన హైదరాబాద్ బంజా రాహిల్స్‌లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి గోనె సంచిని విప్పి చూడగా అందులో ఒక వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. విచారణలో పలు ఆసక్తికర విషయాలు నిజామాబాద్ జిల్లా వర్ని మండలానికి చెందిన భగీరథి (75)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. నిజామాబాద్‌లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న పెద్ద కుమారుడు దత్తు వద్ద ఆమె ఉండేది. అతడి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో తన చిన్న కొడుకు రమేశ్ వద్దకు వారం క్రితం వచ్చింది. కుటుంబ కలహాల వల్ల రమేశ్ భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆరు నెలల క్రితమే వెళ్లిపోయింది. రమేశ్ బంజారాహిల్స్‌లోని షాంగ్రిల్లా ప్లాజాలో వాచ్ మన్. నెల క్రితం బంజారాహిల్స్‌లోని షౌకత్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. వారం క్రితం తన తల్లిని గదికి తీసుకొచ్చాడు. కానీ, ఆమె అప్పటికే జ్వరంతో బాధపడుతోంది. ఐదురోజులుగా పలు రకాల మాత్రలు ఇస్తున్నప్పటికీ జ్వరం తగ్గకపోగా మరింత తీవ్రమైంది. దీంతో ఓనర్‌తోపాటు చుట్టుపక్కల వారు ఆమెకు కరోనా వచ్చి ఉంటుందేమో అంటూ పలు రకాలుగా ప్రశ్నలతో వేధించేవారు. ఇంతలోనే శనివారం అర్ధరాత్రి ఆమెకు శ్వాస ఆడటం ఆగిపోయింది. దీంతో ఏం చేయాలో రమేశ్‌కు అర్థం కాలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. కరోనా అంటే ఊళ్లోకి కూడా రానివ్వరు. ఇక్కడ కూడా అంత్యక్రియలు చేసే అవకాశం లేదు. ఈ విషయాన్ని చుట్టాలకు చెప్పినా ఎవరూ సహకరించరేమోనని కలత చెంది బయట ఎక్కడైనా వదిలేస్తే ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందనుకొని దుప్పటితో తన తల్లిని చుట్టేసి ముఖానికి గోనె సంచి తగిలించి బంజారాహి ల్స్ రోడ్ నంబర్ 2లోని లుంబినీ మాల్ ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్ మీద వదిలేశాడు. (చదవండి: తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు) లోతుగా దర్యాప్తు... కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముందుగా ఈమె యాచకురాలని భావించారు. ఆ తర్వాత విచారణ చేయగా ఆమె కొడుకు షౌకత్‌నగర్‌లో ఉంటున్నట్లు కనుక్కొని రమేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే రమేశ్ చెప్తున్నది నిజమా కాదా అన్నది మరింత లోతుగా విచారణ చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని బంజారాహిల్స్ సీఐ కళింగరావు తెలిపారు. -
టీడీపీ అరాచకాలపై ఐక్య పోరాటం
టీడీపీ అరాచకాలపై ఐక్యంగా పోరాడాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసారుురెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థారుు సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ అక్రమాలు, అరాచకాలపై ఐక్యంగా పోరాడదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చా రు. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో ఉండటానికి భయపడేలా టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని, దీనిని నిలువరించేందుకు పార్టీలోని అన్ని శ్రేణులు కలసికట్టుగా పోరాడాలని కోరారు. గుంటూరులోని వైన్ డీలర్స్ అసోసియేషన్ హాలులో ఆదివారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థారుు సమావేశంలో ఆయన ప్రసంగి స్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులకు భరోసా కలిగించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అందకుం డా చేసేందుకు టీడీపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందనీ, దీనిని అడ్డుకుంటామన్నా రు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. దీనికి వ్యతి రేకంగా వచ్చే నెల 5న తహశీల్దార్ కార్యాలయా ల ఎదుట నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ నేతలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, గుది బండి చినవెంకటరెడ్డి, కొత్తా చినప్పరెడ్డి, ఆర్.రత్నకుమారి, బండారు సాయిబాబు, కావటి మనోహర్‌నాయుడు, విజయకిషోర్, కత్తెర సురేష్‌కుమార్, వెంకటప్పారెడ్డి, బి.నాగిరెడ్డి, నసీర్ అహ్మద్, మండేపూడి పురుషోత్తం, ఆళ్ళ పేర్రెడ్డి, మేరుగ విజయలక్ష్మి, జయలక్ష్మి, కొలకలూరి కోటేశ్వరరావు, చాంద్‌బాషా, బొల్లాపల్లి, బెల్లంకొండ జెడ్పీటీసీ సభ్యులు సంతోషమ్మ, దేవళ్ళ రేవతి పాల్గొన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాలి టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా గతంలో ఉన్న పథకాలను అమలు చేయడంలో విఫలమైంది. ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై పోరాడడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. - రావి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే ప్రతిఘటన తప్పదు టీడీపీ వారు దాడులు, కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెడుతున్నారు. అణచివేత ఉన్నచోట ప్రతిఘటన కూడా ఉంటుంది. మాపై దాడులు చేసిన వారిపై కనీసం కేసులు నమోదు చేయలేదు. టీడీపీ దౌర్జన్యాలు ఎంతోకాలం సాగవు. -అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి చంద్రబాబుది వాగ్ధానాల మాఫీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన వాగ్దానాల మాఫీతో ప్రారంభమైంది. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు, గీత కార్మికులు, మత్స్యకారుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. బెల్టుషాపులు రద్దు చేస్తామని చెప్పారు. ఒక్కటీ అమలు కాలేదు. - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, త్రిసభ్య కమిటీ సభ్యుడు రాజధానిపై అయోమయం సృష్టిస్తున్నారు రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమని ఒకసారి, లక్ష ఎకరాలు కావాలంటూ మరోసారి సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తుండటంతో ప్రజలు అయోమయూనికి గురవుతున్నారు. రాజధానిపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. - ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే కార్యకర్తల కోసం ప్రాణాలు ఇస్తాం టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి. కార్యకర్తలను కాపాడుకునేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయం. జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉండేందుకు న్యాయవాదులను నియమిస్తాం. పల్నాడు పౌరుషాన్ని చూపుతూ ప్రజాసమస్యలపై ఉద్యమించాలి. - సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రూ.5 వేల కోట్లు వడ్డీకి కూడా చాలవు రుణ మాఫీపై కమిటీలు, సాధికారత కార్పొరేషన్ పేరిట రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నా రు. రుణ మాఫీని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారు. సాధికారత కార్పొరేషన్‌కు కేటారుుంచిన రూ. 5 వేల కోట్లు వడ్డీ చెల్లింపులకు కూడా సరిపోవు. రేషన్ బియ్యం, ఇసుకలను టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. -మర్రి రాజశేఖర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మోసకారి ప్రభుత్వంపై పోరాడతాం తప్పుడు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజ లను మోసం చేస్తోంది. దీనిపై వైఎస్సార్సీపీ పోరాడుతుంది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం దారుణం. పింఛను కమిటీల ఏర్పాటుపై న్యాయపోరాటం చేస్తాం. -మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సరస్వతి భూములపై రాజకీయం సరస్వతి సిమెంట్స్ భూములపై టీడీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములను తిరిగి రైతులకు ఎలా ఇస్తారు? భూములపై రాజకీయంతో జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడానికి పూనుకుంటున్నారు. ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలి. -జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ రాష్ర్ట కార్యదర్శి కార్యకర్తలకు అండగా నిలవాలి టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపేలా చట్టపరంగా ముందుకు సాగా లి. వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే నెపంతో పిం ఛన్లకు అర్హులైన లబ్ధిదారుల పేర్లను జాబితాల నుంచి తొలగించారు. రేషన్ బియ్యూన్ని టీడీపీ కార్యకర్తలు దోచుకుంటున్నారు. -గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే జగన్ సీఎం అయ్యేవరకు పోరాడాలి ఎన్నికల సమయంలో రుణ మాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు సాధికారత కార్పొరేషన్ ద్వారా మాఫీ చేస్తాననడం దారుణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు కార్యకర్తలు ధైర్యంగా పనిచేయాలి. - షేక్ మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడరు టీడీపీ నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలను ప్రజలు త్వరలోనే ఎండగడతారు. అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడరు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. ఎస్సీలకు రుణాలు సరిగా అందటం లేదు. -సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై నిర్లక్ష్యం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. రుణాల కోసం ప్రజాప్రతి నిధు లు, కమిటీల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ కార్యకర్తలకే పథకాలు అందేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. - మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. అన్ని పథకాలు పచ్చచొక్కాలవారికే అందేలా కమిటీలు వేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్సార్సీపీ ఉద్యమించింది. ఎన్నికల హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమం నిర్వహిస్తాం. - లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి టీడీపీ తీరుపై అవగాహన కల్పించాలి రుణ మాఫీపై టీడీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. రైతుల ప్రయోజనం కోసం ‘సాక్షి’ మెయిన్, జిల్లా ఎడిషన్లలో ప్రత్యేక పేజీలు ఇస్తున్నారు. - నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి ప్రజాసమస్యలపై పోరాడటంతోపాటు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి పార్టీలకతీతంగా పథకాలను అమలు చేశారు. చంద్రబాబు పాలన దారుణంగా ఉంది. ఆయనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మంచి రోజులు ముందున్నాయి. -హెనిక్రిష్టినా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త