సాక్షి, ఖమ్మం: తెలంగాణలో ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు వేగం పెంచారు. కరీంనగర్‌లో మంత్రి గంగులతో పాటు మైనింగ్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు.. ఖమ్మంపైనా దృష్టి సారించారు. ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులపై ఐటి దాడులు జరుగుతున్నాయి.
చదవండి: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు
ఈ ఉదయం 10 గంటల సమయంలో ఖమ్మం నగరానికి వచ్చిన ఐటీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి మూడు వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బిలీఫ్ ఆస్పత్రితో పాటు మరో రెండు ప్రైవేటు ఆసుపత్రులలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బిలీఫ్ ఆసుపత్రిలో కీలక పత్రాలు సేకరించడంతో పాటు, ఆసుపత్రి లావాదేవీలపై ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే
తనిఖీలు పురైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న బిలీఫ్ ఆస్పత్రిని నాలుగేళ్ల కింద ప్రారంభించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ స్టార్ ఆస్పత్రి ప్రారంభమైంది. ఆసుపత్రి ప్రారంభోత్సవ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆసుపత్రి ప్రారంభోత్సవ వీడియో
Comments
Please login to add a commentAdd a comment