జమ్మూ కాశ్మీర్: చనిపోయిన సోదరుడి సర్టిఫికేట్లను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అన్న బండారం బయట పడింది. దెబ్బతో ఉద్యోగం పోవడమే గాక జైలు పాలైయాడు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. శక్తి బంధు అలియాస్ కాకా జి జమ్మూలోని పోని చాక్ వద్ద నివసిస్తున్నాడు. నిందితుడు గత 30 ఏళ్లుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఐఎంపీఏ) సంస్థలో పని చేస్తున్నాడు. అయితే సదరు వ్యక్తి తొమ్మిదో తరగతి కూడా పాస్ కాకపోయినా చనిపోయిన తమ్ముడి సర్టిఫికేట్లతో, ఇతర అర్హత పత్రాలను సమర్పించి ఎంపీఏ సంస్థ నందు ఉద్యోగం సంపాదించాడు. ఇన్నాళ్ల తరువాత అతని బండారం బయట పడింది. దీంతో ప్రస్తుతం ఐపీసీ లోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసి శక్తి బంధుని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో బంధు మరణించిన సోదరుడి సర్టిఫికేట్లను ఉపయోగించి ఐఎంపీఏలో ఉద్యోగంలో చేరాడని రుజువు అయ్యింది.
( చదవండి: జాబ్ నుంచి సాయిబాబా తొలగింపు )
Comments
Please login to add a commentAdd a comment