సూర్య
సాక్షి, చెన్నై : ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్కాడు సమీపంలోని ముప్పదు వెట్టి పుదియ కాలనీకి చెందిన శక్తివేల్ కుమారుడు సూర్య(26). ఇతను రాణిపేటలోని ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో యువతి కుటుంబసభ్యులు సూర్యను మందలించారు. అయినా వీరి ప్రేమ కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సూర్య గ్రామం సమీపంలోని చెరువు గట్టు వద్ద కత్తిపోట్లకు గురై మృతిచెంది ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment