బిరియానీ కోసం కక్కుర్తి పడిన ఇద్దరు సూడో అధికారులను అనంతపురం రెండో పట్టణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఎస్టీ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. మూడ్రోజులుగా నగరంలోని ఓ హోటల్ నిర్వాహకుడిని బెదిరించి బిరియానీ పార్శిళ్లు పట్టుకెళ్లడం గమనార్హం.
సాక్షి, అనంతపురం క్రైం: బిరియానీ కోసం కక్కుర్తిపడి ఫుడ్ ఇన్‌స్పెక్టర్, కారు డ్రైవర్‌గా అవతారమెత్తిన ఇద్దరిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం నర్సినాయనికుంటకు చెందిన వెంకటేష్‌బాబునాయక్ పెన్నార్‌భవన్‌లోని ఎస్టీ కార్పొరేషన్ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతని స్నేహితుడు రామాంజనేయులునాయక్. బిరియానీలపై మక్కువ పెంచుకున్న వెంకటేష్‌బాబునాయక్ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌గాను, రామాంజనేయులు నాయక్ ఇతని కారు డ్రైవర్‌గాను అవతారమెత్తారు. మూడు రోజుల క్రితం క్లాక్‌టవర్ సమీపంలోని హైదరాబాద్ బిరియానీ హౌస్‌కు వెళ్లి ఏడు బిరియానీ ప్యాకెట్లు పార్సిళ్లు కట్టించుకున్నారు. చదవండి: (రైతు ఇంట్లో ఐటీ దాడులు.. అపార సంపద)
ఈ నెల 27వ తేదీన మరోసారి వచ్చి నాలుగు పార్సిళ్లు తీసుకున్నారు. ప్రతిసారీ ఇక్కడకు రావడమేంటని అనుమానం వచ్చిన బిర్యానీ హౌస్ నిర్వాహకుడు అబ్దుల్‌ఖలీల్‌బాషా కారు డ్రైవర్‌ను ప్రశ్నించాడు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లనే ఎదిరించి మాట్లాడుతావా అంటూ వాగ్వాదానికి దిగాడు. నిర్వాహకుడు వీరిపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూటౌన్ పోలీసులు విచారణ చేపట్టగా వారు నకిలీ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్, కారు డ్రైవర్ అని తేలింది. శనివారం ఉదయం పీటీసీ సమీపంలో వెంకటేష్‌బాబునాయక్, రామాంజనేయులునాయక్‌లను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చదవండి: (కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!)
Comments
Please login to add a commentAdd a comment