
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : కుటుంబసభ్యులతో కలిసి రాత్రి డ్రైవ్‌కు వెళ్లిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి. తప్పుడు సంజ్ఞలు చేసి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 12వ తేదీన ముంబైకి చెందిన ఓ మహిళ ఫ్యామిలీతో కలిసి కారులో గిర్‌గావ్ చౌపట్టికి బయలు దేరింది. రాత్రి 10.15 గంటల సమయంలో కారు నడుపుతున్న భర్త పక్కన ఆమె కూర్చుని ఉంది. మిగిలిన వారంతా వెనకాల సీటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో బైకుపై వెళుతున్న హ్రిశికేష్ అనే వ్యక్తి వారిని ఫాలో అయ్యాడు. సదరు మహిళకు తన మధ్య వేలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు.
ఎందుకలా చేశావ్ అని నిలదీయగా వాగ్వివాదానికి దిగాడు. బాధిత మహిళ కుటుంబం అక్కడి కొద్ది దూరంలో ఉన్న పోలీసును పిలవగా నిందితుడు పరారయ్యాడు. గొడవ జరుగుతున్న సమయంలో బైకుపై ఉన్న మరో వ్యక్తిని వారు పట్టుకున్నారు. అనంతరం అతడ్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.
చదవండి : తాడిపత్రి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై వేట కొడవలితో దాడి
Comments
Please login to add a commentAdd a comment