![Man Having Extra Marrital Affair With Young Women, Found Dead Suspiciously - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/24/man-suicide.jpg.webp?itok=J5TARQnn)
సాక్షి, హైదరాబాద్ : ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల ప్రకారం. .జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందమూరి నగర్ కాలనీలో ఓ యువతితో సునీల్(38)అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరి మధ్య ఇటీవలే మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి సునీల్..ఆ యువతిని వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.
బుధవారం వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి హత్య వరకు వెళ్లిందని అనుమానిస్తున్నారు. మృతుని శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో ఇది హత్యా లేక అనుమానాస్పద మృతి అన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..యువతితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని అన్న శ్యామ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి : నా కోరిక తీర్చు.. లేదంటే నీ భర్త, కొడుకును..
మహిళ హత్య కేసులో యువకుడి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment