తల్లి నగ్న ఫొటోలు తీసి.. కూతురిపై లైంగికదాడి | Man Molested 3 Women Gets Lifetime Prisonment Adilabad Court | Sakshi
Sakshi News home page

ముగ్గురిపై లైంగికదాడి..  నిందితుడికి జీవితఖైదు

Published Tue, Mar 9 2021 11:07 AM | Last Updated on Tue, Mar 9 2021 12:40 PM

Man Molested 3 Women Gets Lifetime Prisonment Adilabad Court - Sakshi

ఆదిలాబాద్‌ టౌన్‌: ముగ్గురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ. 2.60 లక్షల జరిమానా విధిస్తూ ఆదిలాబాద్‌ జిల్లా మహిళా జడ్జి, ఉమ్మడి 6వ కోర్టు జడ్జి వై.జయప్రసాద్‌ సోమవారం తీర్పుచెప్పారని లైజన్‌ అధికారి భాస్కర్‌ తెలిపారు. 2017లో బెల్లంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెల్లంపల్లిలో ఓ ఇంట్లో పనిచేసే మహిళతో షేక్‌ అన్వర్‌ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. రోజూ ఆమెను కలవడానికి వెళ్లే క్రమంలో ఒకరోజు ఆ ఇంటి యజమానురాలు దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా ఫొటోలు తీశాడు. అనంతరం ఆమెపై లైంగికదాడికి యత్నించాడు.

ఆమె ప్రతిఘటించడంతో కొడుకును చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం 9వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెకు తల్లి నగ్నఫొటోలు చూపించి, సోషల్‌ మీడియాలో పెడతానని భయపెట్టి బాలికపైన కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు. వీరిద్దరిపైనే కాకుండా పని మనిషిపైన కూడా అన్వర్‌ లైంగికదాడికి పాల్పడేవాడు. దీంతో బాధితులు బెల్లంపల్లి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయగా, అప్పటి సీఐ నాగరాజు చార్జ్‌షీట్‌ వేశారు. విచారణలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.శ్రీరామ్‌ 16 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది.

చదవండి: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement