
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వనపర్తి: కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నయ్యే కామంతో కళ్లు ముసుకుపోయి చెల్లి వరుసయ్యే బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన జిల్లాకేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారుల ఫిర్యాదు మేరకు వనపర్తి రూరల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు, పోలీసుల కథనం మేరకు.. బాలసదనంలో ఉండే ఓ బాలికను ఇటీవల జమ్ములమ్మ పండుగ కోసం గార్డియన్ అభ్యర్థన, సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు బయటకు పంపించారు.
సోమవారం ఇంటి ఆవరణలో ఉన్న అమ్మాయిని వరుసకు అన్నయ్య వెంకటేష్ అనే యువకుడు బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గార్డియన్ ఇచ్చిన సమాచారం మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అధికారులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ షఫీ తెలిపారు. బాలికలకు తల్లీ తండ్రి ఇద్దరూ లేరు.
Comments
Please login to add a commentAdd a comment