
సిద్దిపేటకమాన్ (సిద్దిపేట): పెళ్లి జరిగి ఐదేళ్లు గడిచినా సంతానం కలగడం లేదనే తీవ్ర మనస్థాపానికై గురై రంగనాయక సాగర్ కాల్వలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
ఎస్‌ఐ మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం భరత్‌నగర్‌కు చెందిన శివాని(23)ఐదేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా మాచాపూర్ మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన మల్లేశంను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వీళ్లు సిద్దిపేటలోని ముర్షద్‌గడ్డలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో పెళ్లి అయి ఐదేళ్లు గడిచినా సంతానం కలగక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శివాని జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో సిద్దిపేట పట్టణ శివారు ఇమాంబాద్ వార్డు వద్ద ఉన్న కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న కుటంబ సభ్యులు మృతురాలిని గుర్తించారు. ఘటనపై మృతురాలి అన్న కృపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: (నిశ్చితార్థం జరిగినా.. వీడియోలతో భయపెడుతూ పలుమార్లు అత్యాచారం)
Comments
Please login to add a commentAdd a comment