
లక్నో : తనను కలవడానికి నిరాకరించినందుకు మైనర్ యువతిని తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి హత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. లక్నోకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరాబంకి జిల్లాలో 17 ఏళ్ల మైనర్ యువతి తన కుటుంబంతో నివాసముంటోంది. ఈ క్రమంలో గత రెండు రోజులుగా కూతురు కనపడకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఓ వ్యక్తితో మైనర్ బాలిక ప్రేమలో ఉందని తెలుసుకున్న పోలీసులు అతనిని పిలిపించి విచారించారు. విచారణలో నేరానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు.చదవండి: హథ్రస్ కేసు: ఆ రైతు పాలిట శాపంగా..
యువతి, తను కొంత కాలంగా ప్రేమలో ఉన్నామని, ఇటీవల తనను కలిసేందుకు ఆమె నిరాకరించడంతో తన స్నేహితునితో కలిసి హత్య చేసినట్లు పేర్కొన్నాడు. ముందుకు బాలికపై ఇద్దరు సామూహిక హత్యాచారం చేసి తరువాత కాలువలో తోసి చంపేసినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితులపై హత్యా, సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. మరో సంఘటనలో ఢిల్లీ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాపూర్‌లోని 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు ఉత్తర ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. హాపూర్‌కు చెందిన బాలికకు ఇటీవల కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు బాలిక గర్భవతి అని చెప్పడంతోఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: కంగనాకు అత్యాచార బెదిరింపు..
Comments
Please login to add a commentAdd a comment