Hyderabad: ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి.. | Mother and her Two Children go Missing in Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి..

Published Sun, Jan 9 2022 9:17 PM | Last Updated on Sun, Jan 9 2022 9:22 PM

Mother and her Two Children go Missing in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఓ గృహిణి, ఇద్దరు పిల్లలతో బయటికి వెళ్లి కనిపించకుండా పోయిన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రవి కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌దర్వాజా బచ్చన్న దేవాలయం ప్రాంతానికి చెందిన వెంకటరమణ, రంగనగరి సింధూ (28)లు దంపతులు. వీరికి రోహిత్‌ (5), మోక్షా (4)లు సంతానం ఉన్నారు.

కాగా ఈ నెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు రంగనగరి సింధూ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేయగా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో తన భార్య, పిల్లలు కనిపించడం లేదని వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: (వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement