
సాక్షి, మందడం(తాడికొండ): వివాహేతర సంబంధం నేపథ్యంలో వివాహితను హత్యచేసి హత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఘటన తుళ్లూరు మండలం మందడం గ్రామ పరిధిలో జరిగింది. సీఐ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మందడం గ్రామానికి చెందిన నాగమణి(35)కి రెండు సంవత్సరాలుగా డేవిడ్ రాజుతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది.
చదవండి: (హత్యల మిస్టరీ వీడింది.. తాగి తందనాలాడుతుంటే తిడుతోందని..)
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో డేవిడ్ రాజుకు అన్నం ఇచ్చి వస్తానని వెళ్లింది. ఎంతసేపటికీ తల్లి ఇంటికి రాకపోవడంతో కుమార్తె మైనా చూసి వచ్చేందుకు వెళ్లగా మెడకు టవల్ చుట్టి ఫ్యానుకు వేలాడుతూ మోకాళ్లపై చనిపోయిన స్థితిలో ఉండటం గమనించి స్థానికులకు విషయం తెలిపింది. డేవిడ్ రాజు తన తల్లిని చంపి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చూస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
చదవండి: (భార్య మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు!)
Comments
Please login to add a commentAdd a comment