సాక్షి, చెన్నై: మేకల దొంగల చేతుల్లో ఎస్‌ఐ హత్యకు గురైన ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. తనిఖీల్లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)ను వాహనంతో ఢీకొట్టి హతమార్చిన ఘటన కరూర్‌లో సోమవారం ఉదయం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కరూర్ రీజనల్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా కనకరాజ్ పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం కరూర్ బైపాస్ రోడ్డులోని పుత్తాం పుదుర్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అటు వైపుగా వచ్చిన ఓ వాహనం ఆయన్ను ఢీకొట్టి వెళ్లి పోయింది. దీనిని ప్రమాదంగా తొలుత భావించారు.
చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్‌ఐని చంపేశాం..)
గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మరణించారు. రంగంలోకి దిగిన కరూర్ పోలీసులు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా విచారణ చేశారు. ఓ వ్యాన్ మహిళలను ఎక్కించుకుని అతి వేగంగా వెళ్లడాన్ని గుర్తించారు. ఎలాంటి అనుమతులు పొందకుండా ఓ జౌళి సంస్థకు చెందిన వ్యాన్ అధిక లోడింగ్‌తో వెళ్తూ, ఆపేందుకు యత్నించిన కనకరాజ్‌ను ఢీకొట్టి వెళ్లినట్టు తేలింది. వ్యాన్‌ను పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనను సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ప్రకటించారు.
చదవండి: (మేకల దొంగల వీరంగం.. స్పెషల్ ఎస్సై హత్య.. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా)
Comments
Please login to add a commentAdd a comment