హైటెక్‌ వేశ్యావాటిక.. యాప్‌ ద్వారా.. | Mysore Police Arrested 2 Persons Over Luring Men Illegal Activities | Sakshi
Sakshi News home page

వేశ్యావాటిక నిర్వాహకులు అరెస్టు

Mar 14 2021 2:38 PM | Updated on Mar 14 2021 2:49 PM

Mysore Police Arrested 2 Persons Over Luring Men Illegal Activities - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మైసూరు: హైటెక్‌ వేశ్యావాటిక నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను మైసూరు మేటెగళ్లి పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన సుమ, సిద్ధరాజులను అదుపులోకి తీసుకున్నారు. కాగా మైసూరు కుంబారకొప్పలిలోని కిడిగణ్నమ్మన లేఔట్‌లో నివాసం ఉంటూ యాప్‌ ద్వారా విటులను ఆకట్టుకుని, సుమ దందా నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె నివాసంపై దాడి చేసి అరెస్ట్‌ చేశారు.   

రూ.6.9 లక్షల చోరీ సొత్తు స్వాధీనం
యశవంతపుర: చోరీలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న  శిడ్లఘట్టకు చెందిన అసీఫ్‌పాషా, ఆర్‌టీ నగరకు చెందిన అర్షద్‌ఖాన్‌లను సంజయనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులనుంచి రూ. 6.9 లక్షల విలువైన 154 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.  నిందితులు సంజయనగర్‌లో మాలా అనే మహిళకు చెందిన బైక్‌ను చోరీ చేశారు. ఈకేసు దర్యాప్తు చేస్తుండగా భూపసంద్ర వద్ద నిందితులు పట్టుబడ్డారు. అసీఫ్‌పాషాపై చంద్రలేఔట్, కలాసిపాళ్య పోలీసుస్టేషన్ల పరిధిలో,  అర్షద్‌ఖాన్‌పై ఆర్‌టీనగర పోలీసుస్టేషన్‌ పరిధిలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు 

రైలు కింద పడి బలవన్మరణం  
శివమొగ్గ: కదులుతున్న రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం శివమొగ్గ జిల్లాలోని భద్రావతి పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. మృతుడికి 25 సంవత్సరాల ఉంటాయని, వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.    

చదవండి: కీచకుడిని వెంటాడి రఫ్ఫాడించిన యువతి
ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement