
సాక్షి, హైదరాబాద్ : తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి చేత కేసు పెట్టించిన డాలర్ బాయ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భద్రాద్రి జిల్లాలో రాజ శ్రీకర్‌రెడ్డి అలియాస్ డాలర్ బాయ్‌పై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. పదేళ్ల క్రితమే డాలర్ బాయ్‌పై రామవరంలో కేసు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. చీటీల పేరుతో తన స్వస్థలంలోని రామావరంలో డబ్బులు డిపాజిట్ చేయించి మోసం చేశారు. 10 లక్షల రూపాయలను తీసుకొని హైదరాబాద్‌కు పారిపోయాడు. (చదవండి : ఎవరీ డాలర్ బాయ్? )
బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకొని వస్తుండగా ఓ వ్యక్తి నుంచి ఏడు లక్షల రూపాయలు దొంగిలించిన కేసులో డాలర్ బాయ్‌పై కేసు ఫైల్ అయింది. ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా డాలర్‌భాయ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో రాజశ్రీకర్ అలియాస్ డాలర్‌భాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి : 139 మంది అత్యాచారం కేసులో ట్విస్టు)
Comments
Please login to add a commentAdd a comment