సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో నకిలీ బంగారంతో ఓ వ్యక్తి బ్యాంకునే మోసం చేసే ప్రయత్నం చేశారు. మహేశ్వరం మండలం ఆంధ్ర బ్యాంకులో నకిలీ గోల్డ్‌తో రుణాలు పొందాడు. దీనికి బ్యాంక్ కొలతలు చూసే సిబ్బంది అతడికి సహాయం చేశారు. నకిలీ గోల్డ్ పెట్టుకొని బ్యాంకుకు టోకరా చేసే ప్రయత్నం చేశాడు. అతడి పరిచయస్తుల పేర్ల మీద గోల్డ్ తాకట్టు పెట్టి బ్యాంకు లోన్ తీసుకున్నాడు. రెండున్నర కోట్ల రూపాయల వరకు బ్యాంకు నుంచి రుణాలు పొందాడు. కాగా గత నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి, అతనికి సహకరించిన బ్యాంకు సిబ్బంది మొత్తం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సంఘటనపై విచారించేందుకు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ చేరుకున్నారు. నకిలీ గోల్డ్ మోసం నేపథ్యంలో పలువురు బ్యాంకు సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment