
తిరువళ్లూరు: శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకుని బ్రిడ్జిపై నుంచి కిందకు దూకి.. వ్యక్తి మృతి చెందిన ఘటన తిరువళ్లూరు జిల్లా నెమిలిచ్చేరిలో చోటు చేసుకుంది. చెన్నై విల్లివాక్కం ప్రాంతానికి చెందిన బాలాజీకి సత్యనారాయణ (26), సూర్యనారాయణ (24) కుమారులు ఉన్నారు. సూర్యనారాయణకు వివాహం కాగా, సత్యనారాయణకు కాలేదు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తిరునిండ్రవూర్‌లోని మేన మామ ఇంట్లో ఉంటూ శంకరమఠంలో పనిచేస్తున్నాడు. సోమవారం నెమిలిచ్చేరి బ్రిడ్జిపైకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. బ్రిడ్జిపై నుంచి కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment