
సాక్షి, గుంటూరు : జిల్లాలో ఆధార్ కార్డుల్లో అక్రమాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. ఆధార్‌లో పుట్టిన తేదీ, పేరు, విద్యార్హతలను మార్పులు చేస్తున్న 8 మందిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాలను ఫోర్జరీ చేస్తూ మోసాలకు పాల్పడుతోంది. రెండు నెలల్లో 500 మంది ఆధార్ కార్డులో మార్పులు చేసినట్టు అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి స్కానర్, ఐరిష్ కెమెరా, రబ్బర్ స్టాంపులు, 22 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment