బాలికపై అత్యాచారానికి పాల్పడిన ట్యూటర్‌ అరెస్టు | Police Arrested Chhattisgarh Tutor For Molested 9 Years Old Girl | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారానికి పాల్పడిన ట్యూటర్‌ అరెస్టు

Published Tue, Aug 11 2020 4:57 PM | Last Updated on Tue, Aug 11 2020 5:02 PM

Police Arrested Chhattisgarh Tutor For Molested 9 Years Old Girl - Sakshi

చత్తీష్‌గడ్: రాయ్‌పూర్‌లో ఓ ఇంట్లోకి చొరబడి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు సోమవారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం... అర్షద్‌ రెహ్మానీ(27) అనే వ్యక్తి మదర్సా అనే విద్యా సంస్థలో ఉపాద్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాధిత బాలిక సోదరికి అరబిక్‌ నేర్పడించడానికి ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం  బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమెపై లైంగిక దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. (చదవండి: కూతురు ఆత్మహత్య.. భర్తతో అంత్యక్రియలు)

ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారి ఫిర్మాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.  దీనిపై ఖమర్థిన్‌ పోలీసు స్టేషన్‌ హౌజ్‌ఆఫీసర్‌ మమతా శర్మ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు బాలిక సోదరికి అరబిక్‌ నేర్పించేందుకు బాధితురాలి ఇంటికి రోజు వెళ్లేవాడని, ఈ క్రమంలో ఆదివారం బాధిత బాలికపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడి పారిపోయినట్లు వెల్లడించారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 376 (అత్యాచారం), 506 (క్రిమినల్ బెదిరింపు)  పోక్సో చట్టం కింద  కేసు నమోదు చేసినట్లు మమతా శర్మ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement