మార్వాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్
సాక్షి, అఫ్జల్‌గంజ్: ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను ప్రభుత్వ వైద్యుడినని చెప్పుకుంటూ రోగులకు వేద్యసేవలు చేస్తున్న వైద్యుడిని డ్యూటీ సీఎంఓ డాక్టర్ ప్రణీత గుర్తించి వెంటనే ఆర్‌ఎంఓకు సమాచారం ఇచ్చారు. ఆర్‌ఎంఓ సిద్ధీఖీ అతడిని విచారించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నకిలీ డాక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చంద్రాయణగుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన మార్వాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌గా (27) గుర్తించారు. ఇతను గతంలోనూ ఉస్మానియా ఆస్పత్రిలో నకిలీ వైద్యుడిగా చలామణి అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై బాలస్వామి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment