జీహెచ్‌ఎంసీ ఉద్యోగి అవతారమెత్తి వసూళ్లు   | Police Held Fake GHMC Employees For Collect Money From Shoppers In Hyderabad | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ ఉద్యోగి అవతారమెత్తి వసూళ్లు  

Published Fri, Mar 26 2021 8:14 AM | Last Updated on Fri, Mar 26 2021 8:14 AM

Police Held Fake GHMC Employees For Collect Money From Shoppers In Hyderabad - Sakshi

నిందితుడు వెంకటేశ్‌..

సాక్షి, జగద్గిరిగుట్ట: జీహెచ్‌ఎంసీ ఉద్యోగి అవతారమెత్తి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టుచే శారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట శ్రీనివాస్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌(28) జీహెచ్‌ఎంసి శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెమెంట్‌ అవతారమెత్తి గాజులరామారం డివిజన్‌ పరిధిలోని పలు కాలనీల్లో దుకాణ యజమానుల నుండి డబ్బులు వసూళ్లుకు పాల్పడ్డాడు. ప్లాస్టిక్‌ సంచులు వాడుతున్నారని, అధికారులకు తెలిస్తే భారీగా ఫైన్‌లు విధిస్తారంటూ బెదిరించి అందినకాడికి దోచుకోవడం అలవాటుగా పెట్టుకున్నాడు.

గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో వెంకటేశ్‌ వసూళ్లపై ఫిర్యాదులు రావడంతో అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిచంగా కరోనా లాక్‌డౌన్‌ నేపధ్యంలో వీలు పడలేదు. ఈ నెల 23న రోడామేస్త్రీ రగర్‌లోని మిలన్‌ బేకరీకి వెళ్లి రూ. 5వేలు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. అనుమానం వచ్చిన బేకరీ నిర్వాహకుడు శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు ఫోన్‌ చేసి రప్పించగా అతను నకిలీ ఉద్యోగిగా తేలింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement