
సాక్షి, యాదాద్రి: వలిగొండలో యువతి శ్రీవాణి అదృశ్యం, హత్య కేసును పోలీసులు చేధించారు. నిన్న వలిగొండ వలిభాషగుట్టల్లో శ్రీవాణి మృతదేహం లభించింది. ఈ కేసులో మిరియాల రవిని, చిన్నపాక రవితేజలను నిందితులుగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 18న తన తల్లితో పాటు వలిగొండకు శ్రీవాణి వెళ్లగా, ప్రియుడు మిరియాల రవి పిలవడంతో వలిభాషగుట్ట దగ్గరకు శ్రీవాణి వెళ్లింది. కాగా శ్రీవాణిపై అనుమానంతో ఆమెను చంపాలని రవి నిర్ణయించుకున్నాడు.
అయితే శ్రీవాణిని హత్య చేసేందుకు తన స్నేహితుడు రవితేజను రవి సహాయం కోరాడు. రవిపై నమ్మకంతో వచ్చిన శ్రీవాణిపై వలిభాషగుట్టల్లో అత్యాచారం చేసిన తర్వాత హత్య చేశాడు. కాగా, అదే రోజు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి శివారులో మిరియాల రవి అనుమానాస్పద మృతి చెందడం సంచలనం సృష్టించింది. రవి అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఈ నెల 29న అనుమానంతో ఏ2 రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, రవితేజ నిజాలను బయటపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment