ట్యాపింగ్‌లో ఇద్దరు ఉన్నతాధికారుల పాత్ర! | Sakshi
Sakshi News home page

ట్యాపింగ్‌లో ఇద్దరు ఉన్నతాధికారుల పాత్ర!

Published Thu, Mar 14 2024 6:00 AM

Police produced Praneet in court - Sakshi

వారి ఆదేశాల మేరకే నేతలు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌ 

ప్రణీత్‌రావు టీమ్‌లో ఓ ఇన్‌స్పెక్టర్‌ సహా 18 మంది 

విచారణకు ఏమాత్రం సహకరించని ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ 

కొందరితో కలసి నేరం చేసినట్టుగా మాత్రం అంగీకారం 

సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్తున్న దర్యాప్తు అధికారులు 

ప్రణీత్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలింపు 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీసుల అదుపులో ఉన్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సమాచారం. కాగా సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్తున్న దర్యాప్తు అధికారులు ఈ అక్రమ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇద్దరు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో నిఘా విభాగానికి చెందిన అధికారులు పాల్గొంటున్నారు.

మంగళవారం రాత్రి సిరిసిల్లలో అరెస్టు చేసిన ప్రణీత్‌రావును హైదరాబాద్‌ తరలించిన అధికారులు ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ఎస్‌ఐబీ కార్యాలయంలో ప్రణీత్‌ ఏర్పాటు చేసుకున్న స్పెషల్‌ టీమ్‌లో ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్, హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు 15 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్లు తెలిసింది. వీరిని సైతం దర్యాప్తు అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తూ వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు.  



ఫోరెన్సిక్‌ పరీక్షలకు ప్రణీత్‌ ఫోన్‌ 
ప్రణీత్‌ నుంచి సీజ్‌ చేసిన ఫోన్‌ను దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం పంపారు. అక్క డి నిపుణులు ఆ ఫోన్‌ నుంచి వెళ్లిన ఎస్‌ఎమ్‌ఎస్, వాట్సాప్‌ సందేశాలను రిట్రీవ్‌ చేయగలిగారు. వాటి ఆధారంగానే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్ద రు ఉన్నతాధికారులను గుర్తించగలిగారని సమాచారం.

ఫలా నా నంబర్‌ లేదా వ్యక్తి ఫోన్‌ ట్యాప్‌ చేయాలంటూ వీరి నుంచి ప్రణీత్‌కు సందేశాలు రావడం, ఆ ట్యాపింగ్‌కు సంబంధించిన కొన్ని రికార్డులను ప్రణీత్‌ వీరికి పంపినట్లుగా గుర్తించినట్టు తెలిసింది. ఇద్దరు ఉన్నతాధికారుల్లో ఒకరు అప్పటికే పదవీ విరమణ పొంది, ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగిన అధి కారి కాగా.. మరొకరు ఇప్పటికీ సర్వీసులో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరికొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఆ అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.  

ఐదేళ్లలో 2 లక్షలసంభాషణలు రికార్డు 
ప్రణీత్‌రావు పోలీసు శాఖ జారీ చేసిన అధికారిక ఫోన్‌ తో పాటు మరికొన్ని ప్రైవే ట్‌ నంబర్లను విని యోగించినట్లు గుర్తించారు. ఈ ఫోన్‌ నంబర్లను సేకరించిన అధికారులు గడిచిన కొన్నేళ్లల్లో వాటికి వచి్చన, వెళ్లిన కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌ల వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రణీత్‌రావు 2018 నుంచి ఎస్‌ఐబీలో ఆ విభాగం చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావు కనుసన్నల్లో పని చేశాడు. ఐదేళ్లలో అతడు వివిధ ఫోన్‌ నంబర్లకు సంబంధించిన దాదాపు 2 లక్షల సంభాషణల్ని ట్యాపింగ్‌ ద్వారా రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

గతే డాది డిసెంబర్‌ 4 రాత్రి ఎస్‌ఐబీ కార్యాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసిన హార్డ్‌డిసు్కల్లో ఇవి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కొన్ని రికార్డులను అతను కార్యాలయం నుంచి బ యటకు కూడా తరలించినట్లు భావిస్తున్న అధికారులు వాటి కోసం ఆరా తీస్తున్నారు. ప్రణీత్‌రావు కేవలం ప్రతిపక్షాలు, కొందరు ప్రముఖుల ఫోన్లు మాత్రమే కాకుండా బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరివి, పోలీసు అత్యున్నత అధికారులవీ ట్యాప్‌ చేసినట్లుగా ఆధారాలు సేకరించారు. వీళ్లు ఎవరు? ఎవరు చెప్పడంతో చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  ఎన్నికల సందర్భంగా నిధుల తరలింపు! 

గత ఎన్నికలతో పాటు ఇటీ వల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ప్రణీత్‌రావు ఓ పార్టీ నిధుల తరలింపులోనూ కీలక పాత్ర పోషించినట్లు పోలీసు లు అనుమానిస్తున్నారు. తన అధికారిక వాహనంతో పాటు ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌కు సంబంధించిన వాహనాలను దీనికోసం వినియోగించాడని తెలుస్తోంది. నగదు, బంగారం, వెండి ఆభరణా లతో పాటు ఇతర వస్తువులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేర్చడంలో ప్రణీత్‌ కీలక పాత్రధారని పోలీసులు చెప్తున్నారు.  

పోలీస్‌ కస్టడీ కోసంనేడు పిటిషన్‌ 
ప్రణీత్‌రావును బుధవారం రాత్రి పోలీసులు కొంపల్లిలోని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఆయన ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కాగా ప్రణీత్‌ను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు గురువారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఇలావుండగా అయితే తాను మరికొందరితో కలిసి ఈ నేరం చేసినట్లుగా ప్రణీత్‌ రావు అంగీకరించాడని వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఎస్‌.విజయ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ కేసును జూబ్లీహిల్స్‌ ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement