రాహుల్ హత్య కేసులో కొత్త కోణం, ఇద్దరు మహిళల ప్రమేయం? | Police Suspect The Of Two Women Behind Rahuls Assassinate | Sakshi
Sakshi News home page

రాహుల్ హత్య కేసులో కొత్త కోణం, ఇద్దరు మహిళల ప్రమేయం?

Published Fri, Aug 20 2021 4:19 PM | Last Updated on Fri, Aug 20 2021 5:45 PM

Police Suspect The Of Two Women Behind Rahuls Assassinate - Sakshi

సాక్షి,విజయవాడ: విజయవాడలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా కోరాడ విజయ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ హత్యతో మరో ఇద్దరు మహిళలకు కూడా సంబంధం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళల ఇంటి సమీపంలోనే రాహుల్ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

గతంలో ఒకసారి ఆ మహిళల తోపాటు కోరాడ విజయ్ కుమార్ ఒంగోలు లోని రాహుల్ ఇంటికి వెళ్ళినట్లు విచారణ లో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఆర్ధిక అంశాలపై పలుమార్లు ఆ మహిళల సమక్షంలోనే  పంచాయతీలు జరిగినట్లు  పోలీసులు నిర్దారించారు. మరో వైపు రాహుల్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని బంధువులకు  వైద్యులు   అప్పగించారు. రాహుల్‌ మృతదేహం స్వస్థలం ఒంగోలుకు పోలీసులు తరలించారు. 

చదవండి:పరిటాల సునీత కుమారుడి బ్యాగ్‌లో బుల్లెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement