![Realtor Srinivas Assassination Case Police Arrested 4 More People - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/21/mdk.jpg.webp?itok=reY6aiwe)
సాక్షి, మెదక్ : రియల్టర్ ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించి మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల కాల్‌డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఆర్థిక లావాదేవీలా? అక్రమ సంబంధమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామ శివారలో ఇటీవల దుండగులు కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దహనం చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
పోలీసుల దర్యాప్తులో కారులోని మృతదేహాన్ని ధర్మకారి శ్రీనివాస్‌దిగా గుర్తించారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని నిర్థారించారు. శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణమని, లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించలేదనే కోపంతో హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment