రోడ్డు ప్రమాదం: సీసీ కెమెరాల్లో రికార్డు | Road Accident In Komaram Bheem Asifabad | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: సీసీ కెమెరాల్లో రికార్డు

Published Thu, Mar 11 2021 8:22 PM | Last Updated on Thu, Mar 11 2021 8:30 PM

Road Accident In Komaram Bheem Asifabad - Sakshi

సాక్షి, కొమరంభీం ఆసిఫాబాద్‌: జిల్లాలోని వాంకిడి మండలం ఇందాని ఎక్స్‌రోడ్డు వద్ద ఓ బొలెరో వాహనం వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢికొట్టింది‌. దీంతో బైక్‌ మీద ఉన్న వ్యక్తులు గాల్లో ఎగిరి రోడ్డు అవతలవైపు పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన​ ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

అయితే ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బైక్‌ను వేగంగా వచ్చి బొలెరో వాహనం ఢికోట్టిన విజువల్ రికార్డయ్యాయి. బైక్‌ను ఢికొట్టిన బొలెరో వాహనదారుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

చదవండి: 250 కిలోల బంగారం స్మగ్లింగ్‌: ప్రీత్‌ అగర్వాల్ అరెస్ట్‌‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement