
ప్రమాద దృశ్యం
సాక్షి, అదిలాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేరెడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుకనుండి ఐచర్ వ్యాన్ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. వారి మృతదేహాలు ఐచర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు,హైవే సిబ్బంది మృతదేహాలను ఐచర్ క్యాబిన్ నుండి క్రేన్ సహాయంతో బయటకు తీయటానికి ప్రయత్నిస్తున్నారు.