నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి | Road Accident At Miryalaguda Chintapalli Highway In Nalgonda | Sakshi
Sakshi News home page

నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Published Tue, Aug 24 2021 6:47 AM | Last Updated on Tue, Aug 24 2021 9:11 AM

Road Accident At Miryalaguda Chintapalli Highway In Nalgonda - Sakshi

సాక్షి,  నల్గొండ : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మిర్యాలగూడ చింతపల్లి హైవే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్‌ బస్సు రోడ్డుపైన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, 10మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

గాయపడిన వారిని స్థానిక మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదానికి బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. మృతి చెందినవారిని నాగేశ్వరరావు(44), జయరావు(42), మల్లికార్జున్(40)గా పోలీసులు గుర్తించారు.

చదవండి: తుపాను ముందు.. ప్రశాంతత!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement