
సాక్షి, గుంటూరు: నక్సల్స్ పేరుతో ఓ ముఠా దోపిడీకి పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ అడ్డరోడ్‌లో ఉన్న భారత్ పెట్రోల్ బంక్‌పై నక్సల్స్ పేరుతో ముగ్గరు వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. నక్సల్స్ డ్రెస్‌లో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి, పెట్రోల్ బంక్‌లో పనిచేసే ఉద్యోగులపై దాడిచేసి అక్కడున్న రూ.35,000 అపహరించుకుపోయారు. ఈ క్రమంలో దుండగులు పెట్రోల్ బంక్ అద్దాలను కూడా పగలగొట్టారు. పెట్రోల్ బంక్ సిబ్బందికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment