సాక్షి, హైదరాబాద్: నగరంలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. అందినకాడికి దండుకుని పరారైన ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే చాంద్రాయణగుట్ట పటేల్ నగర్‌కు చెందిన అంజలి అనే మహిళ స్థానికంగా చిట్టీల వ్యాపారం నిర్వహించేది. 25 ఏళ్లుగా నమ్మకంగా ఉండటంతో స్థానికులు ఆమె వద్ద పెద్ద మొత్తంలో చిట్టీలు వేసేవారు. (చదవండి: మహిళపై యూట్యూబర్ అఘాయిత్యం.. ఆపై)
సుమారు రూ.10 కోట్లు వరకూ చిట్టీల పేరుతో వసూలు చేసి.. ఆ డబ్బుతో రాత్రికి రాత్రే అంజలి బిచాణా ఎత్తేయడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. రెండు వందల మంది బాధితులు చిట్టీలు కట్టి మోసపోయినట్లు తెలుస్తోంది. చాంద్రాయణగుట్ట పోలీసులు ఈ కేసును హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. కాగా చిట్టీల నిర్వహకురాలు అంజలి స్వస్థలం గుంటూరుగా తెలుస్తోంది. పరారైన అంజలి దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: కఠారివారిపాలెంలో ఉద్రిక్తత..)
Comments
Please login to add a commentAdd a comment