కిలాడీ లేడీ.. 30 ఏళ్లుగా.. | Serial Thief Arrested In Mumbai Who Active From 1990 | Sakshi
Sakshi News home page

కిలాడీ లేడీ.. 30 ఏళ్లుగా..

Published Mon, Oct 26 2020 11:44 AM | Last Updated on Mon, Oct 26 2020 11:52 AM

Serial Thief Arrested In Mumbai Who Active From 1990 - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై : 30 ఏళ్లుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. వనితా గైక్వాడ్‌ అనే మహిళ పని కావాలంటూ ఇళ్ల చుట్టూ తిరిగేది. ఏ ఇంట్లోనైనా పని దొరకగానే.. కొన్ని గంటల్లోనే డబ్బు, విలువైన వస్తువులు దోచేసి అక్కడినుంచి పరారయ్యేది. ఈ నెల 19న బాంద్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఇంట్లో నగదు, బంగారు వస్తువులు, వజ్రాలు కాజేసి పరారయింది. ఇంటి యాజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనితతో పాటు ఆమెకు సహాయం చేసిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ( 14 రోజుల తర్వాత టాయిలెట్‌లో శవమై..)

ఆమె 1990నుంచి దాదాపు 30 ఏళ్లుగా 40కిపైగా దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారినుంచి కాజేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వనిత 2019లో శాంతాక్రజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లో పనిలో చేరిన గంటల్లోనే దొంగతనానికి పాల్పడిందని, 5.3లక్షల రూపాయల విలువైన నగలను కాజేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కూడా ఆమెను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement