Hyderabad Software Employee Missing: Nireesha Missing Case Details In Telugu - Sakshi
Sakshi News home page

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అదృశ్యం.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి

Published Wed, Dec 29 2021 6:39 AM | Last Updated on Wed, Dec 29 2021 8:32 AM

Software Engineer Nireesha Goes Missing in Hyderabad - Sakshi

నిరీషా(ఫైల్‌)

సాక్షి, గచ్చిబౌలి: ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ సాయిలు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన జి.నిరీషా(27) గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తోంది. గుంటూరులోనే ఉంటూ వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న ఆమె ల్యాప్‌టాప్‌ కంపెనీలో ఇవ్వాలని తల్లిదండ్రులను గంగసాని వెంకటేశ్వర్‌రెడ్డి, అనురాధలను కంపెనీ వద్దకు తీసుకొచ్చింది.

చదవండి: (దేవుడా ఎందుకీ కడుపుకోత.. నేనేం పాపం చేశా..)

సోమవారం ఉదయం తల్లిదండ్రులు గేట్‌ ముందు ఉండగా లోపలికి వెళ్లి రెండు గంటలైనా తిరిగి రాలేదు. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఫోన్‌ చేసి మీ కూతురు లింగంపల్లిలో ఉందని చెప్పి ఆమెతో మాట్లాడించారు. అక్కడికి వెళ్లిన కొద్ది సేపటికే మళ్లీ ఫోన్‌ చేసి జేఎన్‌టీయూ వద్ద ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా కనిపించ లేదు. ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ ఉంది. దీంతో మంగళవారం గచ్చిబౌలి పీఎస్‌లో తల్లి అనురాధ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (పెళ్లయ్యాక స్వాతితో పీకల్లోతు ప్రేమ.. ట్యూషన్‌కి వెళ్లి..) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement