పెందుర్తి(విశాఖపట్నం): జీవీఎంసీ ఎన్నికలు ముగిసినా టీడీపీ నాయకుల దౌర్జన్యాలు ఆగడం లేదు. జీవీఎంసీ 93వ వార్డులో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు గురువారం రాత్రి రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థి దాసరి అప్పలరాజు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. దీనిపై దాసరి రాజు పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలివీ..
వైఎస్సార్ సీపీ 93వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన దాసరి రాజు ప్రహ్లాదపురంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 10న జరిగిన ఎన్నికల సమయంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల నడుమ చిన్నపాటి వాగ్వాదాలు జరిగాయి. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థి రాపర్తి కన్నా అనుచరులైన దాసరి పెద్దినాయుడు, దున్న శివాజీ, దాసరి సత్యనారాయణ(పండు), దాసరి ఆనంద్, గంగ నూకరాజు, గంగి వరహాలు, కర్రి వెంకటేష్, దాసరి బుజ్జి, కర్రి సంతోష్, గంగ విజయ్, దాసరి అప్పలనర్సయ్య, దాసరి బుజ్జి, గంగ శంకర్‌లు దాసరి రాజు కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు ప్రణాళిక వేశారు.
అదను చూసి గురువారం రాత్రి వీరంతా కలిసి దాసరి రాజు ఇంటిపైకి దౌర్జన్యానికి వెళ్లారు. ఇంట్లో ఉన్న రాజుతో పాటు అతని భార్య అన్నపూర్ణ, తమ్ముడు సత్యనారాయణ, మరదళ్లు పార్వతి, వేణుమాధవిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. మహిళల వస్త్రాలు లాగి అసభ్యంగా ప్రవర్తించి, తీవ్రంగా గాయపరిచినట్లు రాజు ఫిర్యాదు చేశారు. తనను కౌంటింగ్ ముగిసే లోపు చంపుతామని బెదిరించినట్లు పేర్కొన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని, నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. దాడికి పాల్పడిన పలువురు టీడీపీ కార్యకర్తలు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా తమపై వైఎస్సార్‌సీపీ నాయకులు దౌర్జన్యం చేసినట్లు టీడీపీ కార్యకర్తలు కూడా ఫిర్యాదు చేశారు.
చదవండి:
అర్ధరాత్రి విషాదం: పగబట్టిన పొగమంచు..
తల్లీబిడ్డ మృతి కేసు.. విస్తుపోయే నిజాలు
Comments
Please login to add a commentAdd a comment