
అన్నపూర్ణ పండా(ఫైల్)
సాక్షి, ఒడిశా(కొరాపుట్): జిల్లాలోని సిమిలిగుడ పట్టణ ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న 26వ నంబరు జాతీయ రహదారిలో గురువారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సిమిలిగుడకు చెందిన ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ పండా(40) మృతి చెందారు. ఉప్పర మనియా గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె ఉదయం విధుల నిమిత్తం స్కూటీపై పాఠశాలకు వెళ్తుండగా, దుర్ఘటనకు గురైంది.
రోడ్డుకు అడ్డంగా కొన్ని ఆవులు రావడంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పి ఆమె కిందపడిపోయారు. అదే సమయంలో విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కు వెళ్తున్న ఓ కంటైనర్ ఆమెపై నుంచి దూసుకుపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కంటైనర్ డ్రైవర్‌ని అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment