ఖమ్మం అర్బన్: ఏదైనా పని తలపెట్టిన సమయంలో అంతా బాగా జరగాలని దేవుడికి మొక్కుకోవడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ఓ దొంగ బాగా పాటించాడు! ఖమ్మం జిల్లా కేంద్రంలోని 4వ డివిజన్‌లో అంకమ్మ ఆలయం ఉంది. అక్టోబర్ 31న అర్ధరాత్రి ఈ ఆలయం ప్రధాన ద్వారం తాళం పగులగొట్టిన ఓ దొంగ.. హుండీని కూడా పగులగొట్టి అందులో ఉన్న నగదు దొంగిలించాడు.
ఆ దొంగ చోరీ చేయడానికి ముందు అమ్మ వారికి నమస్కరించడం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీని ఆధారంగా దేవస్థానం కమిటీ అధ్యక్షుడు కొమ్ము భాస్కర్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఉందని తెలుసో, తెలియదో కానీ ఆ దొంగ ఆమ్మవారికి నమస్కరించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
(చదవండి: గంజాయి సరఫరా: ఇద్దరు కానిస్టేబుళ్ల కీలక పాత్ర)
Comments
Please login to add a commentAdd a comment