
బొమ్మనహళ్లి(కర్ణాటక): నాలుగు రోజుల క్రితం మద్యం తాగి గొడవపడి ఇద్దరిని హత్య చేసిన కేసులో ఇద్దరిని హెబ్బగోడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అసోంకు చెందిన అబ్దుల్ కరీం, దారుల్‌అలం. బెంగళూరు వాసి రవికుమార్, కోల్‌కతాకు చెందిన చందన్ దాసులను వీరు హత్య చేశారు.
కూలీపనులు చేసుకునే వీరందరూ స్నేహితులు కాగా, ఆనేకల్ తాలూకా సింగేన అగ్రహార వద్ద నీలగిరి చెట్లలో మద్యం తాగారు. ఆ సమయంలో కరీం రవికుమార్‌ను... మందు తీసుకో మచ్చా అన్నాడు. నువ్వు నన్ను మచ్చా అంటావా అని రవికుమార్ గొడవకు దిగాడు. గొడవ ముదిరి అబ్దుల్ కరీం, దారుల్ అలం కలిసి రవికుమార్‌ను, చందన్‌దాస్‌లను దారుణంగా కొట్టి చంపి పరారయ్యారు. విమానంలో అసోంకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా అరెస్టు చేశారు.
ఇవీ చదవండి:
అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్
శశికళకు మరో భారీ షాక్: రూ.వంద కోట్ల ఆస్తులు సీజ్
Comments
Please login to add a commentAdd a comment