ఎలుకలు కొరికిన కర్బూజ తిని.. ఇద్దరు చిన్నారులు మృతి | Two Children Died After Eating Poison Food in Peddapalli | Sakshi
Sakshi News home page

ఎలుకలు కొరికిన కర్బూజ తిని.. ఇద్దరు చిన్నారులు మృతి

Published Fri, Apr 2 2021 1:37 PM | Last Updated on Fri, Apr 2 2021 3:40 PM

Two Children Died After Eating Poison Food in Peddapalli - Sakshi

సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విసంపేటలో కలుషిత ఆహారం కలకలం రేపింది. ఎలుకలకు పెట్టిన మందు కలుషితమై ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. దారబోయిన శ్రీశైలం-గుణావతి దంపతులు ఇంట్లో ఎలుకల కోసం మందు పెట్టగా ఎలుకలు మందుతోపాటు కర్జూజ తిన్నాయి. ఆ కర్జూజను కుటుంబంలోని అయిదుగురు తిన్నారు. దీంతో అస్వస్థతకు కుటుంబ సభ్యులు గురికాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కుమారులు దారబోయిన శివానంద్(10), శరణ్ మృతి చెందారు. తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పుచ్చకాయ తినని చిన్నారుల తాతకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: గోదావరిలో ఏడుగురు గల్లంతు, ఆరుగురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement