
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో సొంత అల్లుడినే కిరాతకంగా నరికి చంపాడో మామ. అనంతరం తలను సంచిలో తీసుకొచ్చి అన్నవరం పోలీసులకు అప్పగించారు. ఈ దారుణ ఘటన రౌతులపూడి మండలం డీజేపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సత్యనారాయణ కుమార్తె పది నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అప్పటినుంచి ఆమె ఇద్దరి కూతుర్లు తాత సత్యనారాయణతోనే ఉంటున్నారు. (చదవండి : ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి)
గత రాత్రి అత్తారింటికి వచ్చిన అల్లుడు లచ్చన్న భార్యను తానే చంపినట్లు మద్యం మత్తులో మామతో చెప్పాడు. పిల్లల్ని కూడా చంపేస్తానని మామను హెచ్చరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన సత్యనారాయణ కత్తితో లచ్చన్న తల నరికాడు. అనంతరం ఆ తలను సంచిలో వేసుకొని అన్నవరం పోలీసులకు అప్పగించాడు. సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని అన్నవరం పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment