విశాఖ ప్రేమోన్మాది కేసులో 'మిస్టరీ' | Vizag Young Man Attacks Case Closely Investigated By Police | Sakshi
Sakshi News home page

విశాఖ ప్రేమోన్మాది కేసులో 'మిస్టరీ'

Published Thu, Dec 3 2020 1:40 PM | Last Updated on Thu, Dec 3 2020 1:49 PM

Vizag Young Man Attacks Case Closely Investigated By Police - Sakshi

సాక్షి, విశాఖపట్నం :   ప్రేమను నిరాకరించిందని ప్రియాంక అనే యువతిపై  ప్రేమోన్మాది దాడి కేసును పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుడు శ్రీకాంత్ పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు .  కేసులో నిందితునిపై ఐపీసి సెక్షన్‌ 307 452 354a 354d 309 కింద కేసు నమోదయ్యింది. శ్రీకాంత్  ఇంతకుముందు కూడా ఆకతాయిగా తిరుగుతూ పలువురు యువతులతో అసభ్యంగా కూడా ప్రవర్తించినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రియాంక, శ్రీకాంత్‌లు గతకొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది.  ఆమెతో సన్నిహితంగా ఫోటోలు దిగి వాటిని ఫేస్‌బుక్‌లో  పెట్టి ఒక రకంగా బ్లాక్‌ మెయిల్‌ చేశాడని స్థానికులు అంటున్నారు. 

ప్రియాంక ఇంటి తలుపు గడియ ఎవరు పెట్టారు ?
 ప్రేమోన్మాది దాడి ఘటనపై విచారిస్తున్న విశాఖ పోలీసులకు ఓ తలుపు గడియ మిస్టరీగా మారింది. అమ్మాయి ప్రియాంక గదిలోలో ఉన్న సమయంలో శ్రీకాంత్ వెళ్లి దాడి చేశారు. ఆమెను బ్లడ్ తో విచక్షణారహితంగా గొంతు కోసేశాడు. అయితే ప్రాణ రక్షణ రక్షణ కోసం ఆమె పెనుగులాడుతూ తలుపు తీయడానికి ప్రయత్నించింది కానీ బయట గడియ పెట్టి ఉండడంతో రాలేకపోయింది. ఆ సమయంలో ఇంట్లో వస్తువులు జాగ్రత్తగా చూడమని ప్రియాంక తల్లి లక్ష్మణ్ అనే యువకుడ్ని ఇంటికి పంపించగా అతను తలుపు గడియ తీయడంతో ప్రియాంక బయటకు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే అప్పటి వరకూ బయట ఉన్న శ్రీకాంత్ గదిలోకి ఎలా వెళ్ళాడు ? అతను వెళ్ళిన తర్వాత తలుపు గడియ బయటే ఎవరు పెట్టారు అన్న విషయం ఒక మిస్టరీగా మారింది. నిజంగా బయట గడియ పెట్టి లేకుంటే శ్రీకాంత్ దాడి నుంచి ప్రియాంక బయట పడే అవకాశాలు ఉంటాయి. యాదృశ్చికంగా ప్రియాంక కుటుంబ సభ్యులు బయట గడియ పెట్టారా లేక ఇతరులు ఎవరైనానా తలుపు గడియ పెట్టారా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement