
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లాలోని భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను తండ్రి సహాయంతో హత్య చేసి అటవీ ప్రాంతంలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం నర్సక్క పల్లి కి చెందిన రమేష్ తాపీ మేస్త్రి, రమేష్ శారద దంపతులకు ఓ కూతురు కుమారుడు, కొద్దిరోజులుగా కుటుంబ కలహాల వల్ల రమేష్ ను అత్తగారిల్లైన నేరేడుపల్లి తీసుకెళ్లారు. అప్పటినుండి రమేష్ కనిపించకుండా పోయాడు.
తన భర్త కనిపించడం లేదంటూ భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో భార్య శారద ఫిర్యాదు చేసింది. అనంతరం రమేష్ బంధువుల పెళ్లికి కూడా వెళ్లి వచ్చింది. నెల తర్వాత అసలు విషయం బయటపడింది. చనిపోయిన వారికి చేయాల్సిన కార్యక్రమాలను శారద చేసింది. నెల మాసికం పెట్టింది. ఇవన్నీ చూసి అనుమానం వచ్చిన బంధువులు గ్రామస్తులు నిలదీయగా తానే చంపినట్టు ఒప్పుకొంది. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా రమేష్ ను తన తండ్రి తో కలిసి చంపేసినట్లు శారద ఒప్పుకుంది. అనంతరం అడవిలో పాతి పెట్టినట్లు పేర్కొంది. రమేష్ బంధువుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment