
సాక్షి, సైదాపూర్(కరీంనగర్): సైదాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య వేధింపులు తాళలేక.. గొడిశాలకు చెందిన మిడిదొడ్డి ప్రకాశ్ (31) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రశాంత్‌రావు తెలిపారు. ప్రకాశ్ తన భార్య ఆమని వేధింపులతో మనోవేదనకు గురై సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇద్దరి మధ్య గత కొంత కాలంగా తీవ్ర మనస్థాపనలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. తన కుమారుడి మృతికి కోడలే కారణమని మృతుడి తల్లి సౌందర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది . ఈ మేరకు మంగళవారం ఆమనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
చదవండి: 6 ఏళ్లుగా వివాహేతర సంబంధం.. పక్కా స్కెచ్.. ప్రియునితో కలిసి...
Comments
Please login to add a commentAdd a comment