
సాయికుమార్ మృతదేహం
ఇందల్వాయి: కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఓ మహిళ తన భర్తను హత్య చేసిన ఘటన గురువారం సిర్నాపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు.. సిర్నాపల్లి గ్రామానికి చెందిన సాయికుమార్(32)కు నిజామాబాద్‌కు చెందిన సునితతో పదేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. భార్యాభర్తలు ఇద్దరు మద్యానికి బానిస అయ్యారు. దీంతో తరుచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో గురువారం ఇంటి వద్ద దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో సునిత తన భర్తను బండ రాయితో తలపై మోది హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో తానే హత్య చేసినట్లు సునిత ఒప్పుకుంది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిటన్లు ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment