
సాక్షి, కొత్తగూడెం : ఫేస్‌బుక్ పరిచయంతో ఓ యువతి రూ.20 లక్షలు బురిడికొట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల కేంద్రానికి చెందిన గిన్నారపు నాగేందర్‌కు ఫేస్‌బుక్ ద్వారా లండన్‌కు చెందిన మెర్సీ జాన్సన్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య కాస్త చనువు పెరగడంతో నాగేందర్‌ను మోసం చేసేందుకు యువతి కుట్రపన్నింది.
రూ. 20లక్షలు ఇస్తే మీకు రిటర్న్‌గా 70వేలపౌండ్లు వస్తాయని నాగేందర్‌ను నమ్మబలికించింది. ఇది నమ్మిన నాగేందర్ విడతల వారిగా రూ.20లక్షలను యువతి అకౌంట్‌లో డిపాజిట్ చేశాడు. తర్వాత తనకు రావాల్సిన నగదు రాకపోవడంతో నాగేందర్ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment