Guntur Crime News: Wife Killed Husband With Lover Help At Ponnur Guntur District - Sakshi
Sakshi News home page

సాయితో సోనీ వివాహేతర సంబంధం.. చంపుతానని భర్త బెదిరించడంతో..

Published Fri, Jan 21 2022 8:31 AM | Last Updated on Fri, Jan 21 2022 9:41 AM

Woman Murders Husband with Lovers Help at Ponnur Guntur District - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

పొన్నూరు (గుంటూరు): విహేతర సంబంధం నేపథ్యంలో భర్త జలచిత్ర నాగరాజును భార్య సయ్యద్‌ అబ్దుల్‌ సోనీ ప్రియుడు జవ్వాజి వెంకట సాయి, అతని స్నేహితుడు చొప్పవరపు బిన్నేంద్రకుమార్‌లతో కలసి హత్య చేయించిందని బాపట్ల డీఎస్పీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

మాట్లాడుతున్న బాపట్ల డీఎస్పీ శ్రీనివాస్‌   

జలచిత్ర నాగరాజుకు సోనీతో తొమ్మిదేళ్ల కిందట ప్రేమ వివాహమైంది. ఒక సంవత్సరం హైదరాబాదులో కాపురం ఉన్నారు. పొన్నూరు పట్టణంలో ఏడేళ్లుగా అద్దె ఇంటిలో ఉంటున్నారు. పట్టణానికి చెందిన జవ్వాజి వెంకట సాయితో సోనీకి వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో సోనీని మందలించడంతోపాటు చంపుతానని భర్త బెదిరించాడు. సోనీ ప్రియుడు, అతని స్నేహితుడైన చొప్పవరపు బిన్నేంద్ర తో కలసి నాగరాజును హత్య చేసేందుకు సిద్ధమైంది. పథకం ప్రకారం 6వ తేదీ రాత్రి నాగరాజు తినే అన్నంలో నిద్రమాత్రలు కలిపారు. ఇంటిలోని సోపాసెట్‌లో నిద్రపోతున్న నాగరాజును వెంకటసాయి, బిన్నేంద్రకుమార్‌లు కొబ్బరి బొండాలు నరికే  కత్తితో మెడపై నరికి, ఇనుపరాడ్డుతో తలపై కొట్టి హత్య చేశారు.

చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా ప్రియున్ని మరిచిపోలేదు.. భర్తకు తెలిసి..) 

మృతదేహన్ని 7వ తేదీ రాత్రి కారులో తీసుకెళ్లి మూలపాలెం గ్రామ పరిధిలోని నాగరాజు కాలువ(యర్రకాలువ)లో పడవేశారు. మక్కేన మస్తాన్‌రా వుతో కలసి ఇంటిలోని రక్తపుమరకలు  కడిగివేశారు. హత్యకు వాడిన కత్తి,  ఇనుపరాడ్డు, రక్తంతో తడిసిన బట్టలను డీవీసీ కాలనీ రోడ్డులోని చేబ్రోలు కాలువ వద్ద పడవేసి ఏమి తెలియనట్లు తిరుగుతున్నారు. సోని చెల్లెలు సీమా ఇచ్చిన సమాచారంతో మృతుడి అన్న జలచిత్ర నాగేశ్వరరావు పట్టణ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ శరత్‌బాబు, సిబ్బంది నిందితులను మండల పరిధిలోని కట్టెంపూడి అడ్డరోడ్డు సమీపంలో అరెస్టు చేశారు. సమావేశంలో పట్టణ సీఐ శరత్‌బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement