
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తొర్రూరు(మహబూబాబాద్): పనికి వెళ్లిన భార్యను ఎందుకు ఆలస్యంగా ఇంటికి వస్తున్నావని భర్త అడగడంతో మనస్థాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. అదనపు ఎస్సై మునీరుల్లా తెలిపిన వివరాల ప్రకారం... కేసముద్రం మండలం ధర్మారం తండాకు చెందిన గుగులోతు సురేష్, జయంతి(29) దంపతులు 8 ఏళ్లుగా తొర్రూరులోని రాజీవ్‌నగర్‌లో తాత్కాలికంగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
భర్త రైస్ మిల్లులో, భార్య పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నారు. కాగా జయంతి బుధవారం రాత్రి ఆలస్యంగా పని నుంచి ఇంటికి చేరుకోగా ఆ విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన జయంతి అందరూ నిద్రపోయాక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి శ్రీవర్ధన్, సాయి సమిత్ అనే ఇద్దరు కుమారులున్నారు. జయంతి తండ్రి భూక్యా లక్కు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చదవండి: మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి.. చివరికి
Comments
Please login to add a commentAdd a comment